కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 11 : ఈ నెల 27న హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభను జయప్రదం చేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. శుక్రవారం బీఆర్ఎస్ కొత్తగూడెం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుతో కలిసి ”చలో వరంగల్” పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఎల్కతుర్తిలో జరిగే సభకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు తరలిరావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతలక్ష్మి, మాజీ ఎంపీపీలు బాధవత్ శాంతి, భూక్యా సోన, బీఆర్ఎస్ పాల్వంచ పట్టణాధ్యక్షుడు మంతపూరి రాజు గౌడ్, ఆత్మకమిటి చైర్మన్ బత్తుల వీరయ్య, పార్టీ మండలాధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు అంబుల వేణు, వేములప్రసాద్, పార్టీ పట్టణ నాయకులు బి శ్రీనివాస్, పిల్లి కుమార్, కరాటే శ్రీనివాస్, బత్తుల శ్రీనివాస్, శ్రీధర్, మైనారిటీ నాయకులు అహ్మద్, యువ నాయకులు బొమ్మిడి శ్రీకాంత్, అశోక్, నిజాముద్దీన్, నౌతన్, కన్నీ, బాచి, అరుణ్, కుమార్ పాల్గొన్నారు.