ఇల్లెందు, ఫిబ్రవరి 05 : ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల్లో ఆటోల ద్వారా ప్రచారానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక రథాలను మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఇల్లెందు పట్టణం జే కే సెంటర్ నుండి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ వార్డు కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రచార వాహనాలను జెకె సెంటర్ ముత్యాలమ్మ టెంపుల్ వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిప్రియ నాయక్ మాట్లాడుతూ.. 24 వార్డులో 24 ప్రచార రధాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రచార రథాల ద్వారా ఇల్లెందు పట్టణంలో గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై అవగాహన కల్పిస్తూ ప్రచారాల రధాలు ప్రచారం నిర్వహిస్తాయని, కారు గుర్తుకు ఓటెయ్యాలని అభ్యర్థిస్తూ 24 వార్డుల్లో ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు.
పట్టణ ప్రజలు గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏ విధమైన అభివృద్ధి చేయని విషయాన్ని గమనించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కారు గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు హరిసింగ్ నాయక్, పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ జబ్బర్, సిలివేరి సత్యనారాయణ, పరుచూరి వెంకటేశ్వర్లు, శీలం రమేష్, చాద్ పాషా, అజ్మీర రవి, అజ్మీర సత్యవతి, సీతారాం నాయక్, భూక్య దల్ సింగ్ నాయక్, భూక్యా లాలు నాయక్ పాల్గొన్నారు.

Hari Priya Nayak : ఇల్లెందులో బీఆర్ఎస్ ప్రచార రథాలు ప్రారంభం