రామవరం, అక్టోబర్ 25 : మలిదశ తెలంగాణ ఉద్యమంలో గ్రంథాలయ మాజీ డైరెక్టర్, బీఆర్ఎస్ పార్టీ స్టేట్ సెక్రెటరీ, స్వర్గీయ మోరె భాస్కర రావు పాత్ర మరువలేనిదని కౌన్సిలర్ మోరే రూప అన్నారు. ఆయన జయంతి సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారంతో శనివారం రామవరం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ మలిదశ పోరాటంలో భాస్కర్ ముందుండి అందరిని తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యాలను చేయడంలో ఆయన పాత్ర మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో మోరె పార్వతి, మోరె చాణిక్య, తమ్ముడు మోరె రమేశ్‌కుమార్, కంటాత్మకురి శివ ప్రసాద్, బత్తిని రాజశేఖర్, కోలా ఎల్లయ్య, టంగుటూరి శివకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Ramavaram : ‘తెలంగాణ ఉద్యమంలో భాస్కర్ పాత్ర మరువలేనిది’