భధ్రాచలం, జనవరి 29 : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. రామాలయంలోని చిత్రకూట మండపంలో ఆలయంలోని హుండీలను తెరిచి దేవస్థానం ఈఓ కె.దామోదర్‌రావు ఆధ్వర్యంలో సిబ్బంది లెక్కింపు చేపట్టారు. మొత్తం రూ.2,31,31,984 కోట్లు సమకూరినట్లుగా తేలింది. అలాగే 56 గ్రాముల బంగారం, 1,400 గ్రాముల వెండి, 544 యుఎస్ డాలర్లు, 750 దక్షిణాఫ్రికా డాలర్లు, 2,400 నేపాలీ రూపాయలు, 100 ఒమన్ బైజన్లు, 30 యూరోపియన్ డాలర్లుతో పాటు ఇతర విదేశీ కరెన్సీ భక్తులు కానుకలుగా వేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రావణ్‌కుమార్, భవానీ రామకృష్ణ, పర్యవేక్షకులు కత్తి శ్రీనివాస్, అనిల్‌కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.