విద్యకు అధిక ప్రాధాన్యం
- సమాజంలో మార్పు రావాలాంటే చదువు ముఖ్యం
- మంత్రులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్‌కుమార్
- కొత్తగూడెంలోని రామవరంలో ఏకలవ్య పాఠశాల ప్రారంభం
- కేఎస్ఎం వద్ద నూతన కలెక్టర్ కార్యాలయ పనుల పరిశీలన
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 8 (నమసే ్తతెలంగాణ): సమాజంలో మార్పు రావాలాంటే చదువు చాలా ముఖ్యమని, అందుకని తెలంగాణ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరంలో రూ.12 కోట్లతో నిర్మించిన ఏకలవ్య మోడల్ స్కూల్‌ను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో కలిసి శుక్రవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ గిరిజన సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కారుకు పెద్దపీట వేస్తోందని అన్నారు. గతంలో 90 గురుకులాలు ఉంటే ఇప్పుడు 183 గురుకులాలు ఉన్నాయని అన్నారు. పదో తరగతి చదువుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా వాటిలోనే జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్ విదేశీ విద్యనిధి పథకంలో భాగంగా విదేశీ విద్యను ప్రోత్సహించి ఇతర దేశాల్లో చదువుకునే అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోందని అన్నారు. ఈ ఏకలవ్య పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామమన్నారు. రోడ్డు, క్రీడా సామగ్రి కోసం రూ.కోటి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మంచిగా చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు.
నూతన కలెక్టరేట్ పరిశీలన..
జిల్లా కేంద్రం సమీపంలోని కేఎస్ఎం వద్ద నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు. త్వరలో కలెక్టరేట్ ప్రారంభం కాబోతోందని అన్నారు. పూర్తయిన పనుల గురించి కలెక్టర్ అనుదీప్‌ను అడిగి తెలుసుకున్నారు. ఐటీడీఏ పీవో గౌతమ్, ఆర్అండ్బీ ఈఈ బీమ్లా, మున్సిపల్ చైర్పర్స్న్ కాపు సీతాలక్ష్మి, ఆర్సీవో డేవిడ్‌రాజు, డీడీ రమాదేవి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

