కేసీఆర్ పాలనతోనే తెలంగాణ సుభిక్షం
టీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించండి
ఎంపీ నామా నాగేశ్వరరావు, వనమా రాఘవేంద్రరావు
46,47,48 డివిజన్లలో విస్త్రృత ప్రచారం
ఖమ్మం, ఏప్రిల్ 25: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే టీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నాయకుడు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేంద్రరావు పిలుపినిచ్చారు. ఆదివారం నగరంలోని 46,47,48 డివిజన్లలో కన్నం వైష్ణవి, మాటేటి అరుణ, తోట గోవిందమ్మ విజయాన్ని కాంక్షిస్తూ ఆయా డివిజన్లలో జరిగిన రోడ్‌షోలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. మాజీ కార్పొరేటర్లు తోట రామారావు, మాటేటి నాగేశ్వరరావు, కనకం భద్రయ్య, టీఆర్ఎస్ నాయకులు కన్నం ప్రసన్న కృష్ణ, కృష్ణ, వెంకన్న, కొత్తగూడెం వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, ఎంపీపీ బదావత్ శాంతి, కొట్టి వెంకటేశ్వర్లు, అన్వర్‌పాషా, ఎండీ రజాక్, సోమిరెడ్డి మధుసూదన్‌రావు, అనుదీప్, మాటేటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.