కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 23 : తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అన్నారు. దసరా సంబరాల్లో భాగంగా మూడో రోజు జరుపుకునే ముద్దపప్పు బతుకమ్మ వేడుకలను మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, శిక్షణ కలెక్టర్ సౌరభ్ శర్మ హాజరై, మహిళా ఉద్యోగులతో కలిసి భక్తిశ్రద్ధలతో బతుకమ్మ పూజలో పాల్గొని ఆడిపాడారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం వల్ల సాంఘిక ఐక్యత బలపడుతుందన్నారు. అలాగే ముద్దపప్పు బతుకమ్మ సమర్పణ ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ శ్రేయస్సుకు దోహదం చేస్తుందనే విశ్వాసం అన్నారు. ఈ వేడుకల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా వైద్య శాఖ అధికారి జయలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనీనా, వైద్య శాఖ సిబ్బంది, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
Kothagudem Urban : ఆత్మగౌరవం, సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ : అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్