టేకులపల్లి, డిసెంబర్ 08 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న దివ్యాంగ ఉపాధ్యాయుడు బానోత్ లక్ష్మా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ విద్యాచందన చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. జిల్లా స్థాయిలో రెండోసారి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడంపై బానోత్ లక్ష్మా సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయో వృద్ధుల, వికలాంగుల అభివృద్ధి అధికారి లేనినా, జిల్లా భవిత కో ఆర్డినేటర్ సైదులు పాల్గొన్నారు.