లక్ష్మీదేవిపల్లి, జనవరి 03 : ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గెలుపొందిన బంజారా సర్పంచులు, ఉప సర్పంచులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంజారా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 6న సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు బంజారా సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ బానోత్ వీరు నాయక్ తెలిపారు. శనివారం లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జేఏసీ చైర్మన్ డాక్టర్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో కొత్తగూడెం కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్లో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న బంజారా సర్పంచులు, ఉప సర్పంచ్ దంపతులు హాజరు కావాల్సిందిగా పిలుపునిచ్చారు.
ఈ సన్మాన కార్యక్రమానికి తాజా, మాజీ బంజారా ఎమ్మెల్యేలు. ఎంపీలు. ఎమ్మెల్సీలు, మంత్రులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులు, స్థానిక వివిధ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుల సంఘాల నాయకులు, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భూక్యా రాంబాబు. బంజారా సంఘాల జేఏసీ ప్రధాన కార్యదర్శి గూగులోత్ కేశవ నాయక్. ట్రెజరర్ బానోతు రమేష్ నాయక్, సాదు సంఘాల జిల్లా అధ్యక్షుడు, జేఏసీ నాయకులు బానోత్ గణేష్ సాదు, మహిళా కో కన్వీనర్ బట్టు మంజుల, తేజావత్ రాములు నాయక్, జేఏసీ కో కన్వీనర్లు గుగులోత్ చందర్, గుగులోతు బద్రు, బానోత్ మోహన్, లావుడియా హనుమంతు, మాలోత్ గాంధీ, సోషల్ మీడియా ఆర్గనైజర్ గుగులోత్ వినోద్ పాల్గొన్నారు.