చండ్రుగొండ: మిరపతోటలో మొక్క తడిసేవిధంగా పై మందులు పిచికారి చేయాలని కేవికే శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మినారాయణమ్మ రైతులకు సూచించారు. మంగళవారం తిప్పనపల్లి గ్రామంలో రైతులకు పై మందులు పిచికారి విధానంపై అవగాహన కల్పించారు. తొలుత మిరపతోటలను క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు ఎదుర్కొంటున్న పంట సమస్యలను గురించి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం మిరపతోటల్లో తామర పువ్వు తెగులు , నల్లి, దోమ, పై-కింద ముడద, కొమ్మ కుళ్లు వంటి లక్షణాలు ఉన్నాయని, వీటిని అరికట్టాలంటే రైతులు కచ్చితంగా మొక్క తడిసేలా మందులు పిచికారి చేయాలని సూచించారు.
స్ప్రేయింగ్లో తేడా ఉంటే మందులు సరైన ఫలితాలు ఇవ్వవన్నారు.పెట్టుబడులు తగ్గాలంటే మందుల వాడకాన్ని తగ్గించాలని, నిర్దేశించిన మోతాదులో మాత్రమే మందులు వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు విశ్వతేజ, శివ, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ గాదె లింగయ్య, ఏఈఓ శ్రీకన్య, రైతులు మైమూద్, పసుపులేటి మంగయ్య, సయ్యద్ షపీ, అంచ అప్పారావు, తాళ్లూరి వెంకటేశ్వర్లు, వేల్పుల చిన్నవీరయ్య, ఆంద్రా శ్రీను, సత్యనారాయణ, ఉపేందర్, పసుపులేటి రాధక్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.