సుజాతనగర్ : మండలంలోని పాత అంజనాపురం రైతు వేదికలో గురువారం సేంద్రీయ వ్యవసాయ సాగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేవీకే కో ఆర్డినేటర్ డాక్టర్ వి.లక్ష్మీనారాయణమ్మ, ఏడీఏ కరుణశ్రీలు పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు విశ్వతేజ, శ్రీనివాస్, వ్యవసాయ అధికారులు నర్మద, రాజేశ్వరి, రఘుదీపిక, రాకేష్, ఏఈవోలు శరత్, వినీల, ప్రనూష; గోపి, లావణ్య, మణికంఠ, గౌస్, రైతులు ధర్మారావు, శేఖర్, అమృ, రాములు, శ్రీను, మంగీలాల్, ప్రసాద్‌లు పాల్గొన్నారు.