చుంచుపల్లి, జనవరి 08 : టీబీ ముక్త్ భారత్ క్యాంపెయిన్లో భాగంగా గురువారం జూలూరుపాడు టీబీ యూనిట్ పెనగడప పీహెచ్సీ రుద్రంపూర్ పరిసర ప్రాంతాల్లో డాక్టర్ నేహా అమ్రిన్ అధ్యక్షతన టీబీ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్షయ వ్యాధి లక్షణాలు, రెండు వారాల నుంచి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, రాత్రిళ్లు చెమటలు పట్టడం, దగ్గినప్పుడు తెమడలో రక్తం పడడం వంటివి ఉన్నట్లయితే దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లి తెమడ పరీక్ష, Xray పరీక్ష చేయించుకోవాలన్నారు. టీబీ నిర్ధారణ అయితే ఆరు నెలలు క్రమం తప్పకుండా మందులు వాడితే క్షయ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చన్నారు. క్షయ వ్యాధిగ్రస్తుడు మందులు వాడుతున్నంత కాలం నెల నెలా రూ.వెయ్యి పోషణ భత్యం నిమిత్తం క్షయ పోషణ యోజన పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం క్షయ వ్యాధి అనుమానితుల వద్ద నుండి తెమడ శాంపిల్స్ సేకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోతు కేసరి, డాక్టర్లు నవ జ్యోతి, నరేంద్ర ప్రసాద్, మహేందర్, ఝాన్సీరామ్, సెక్రటరీ నరేంద్ర, హెచ్ ఇ ఓ వెంకటేశ్వర్లు, హెచ్ వి సుభద్ర, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.