చుంచుపల్లి, మే 08 : కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు మహిళా రక్షణ చట్టాలపై చుంచుపల్లి మండల కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో గల జీవీ మాల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి గురువారం షీ టీమ్ అవగాహన కల్పించింది. ఈ సందర్భంగా షీ టీమ్ ఎస్ఐ రమాదేవి మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం షీ టీమ్ పనిచేస్తుందని తెలిపారు. ఎలాంటి సమయాల్లోనైనా మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
మహిళలను ర్యాగింగ్ చేయడం, అనుసరించడం, కామెంట్ చేయడం, రాంగ్ కాల్స్, మేసేజ్‌లు చేయడం, సోషల్ మీడియాలో సైతం అభ్యంతరకరంగా ప్రవర్తిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. మహిళలు ఏ విధంగానైనా ఇబ్బందులకు గురైతే షీ టీమ్‌ని నిర్భయంగా సంప్రదించవచ్చు అన్నారు. బాధితుల వివరాలు గొప్యంగా ఉంచబడునని తెలిపారు. మహిళలు ఫిర్యాదు ఇవ్వాలనుకుంటే కొత్తగూడెం షీ టీమ్ ఫోన్ నంబర్ 8712682131కి కాల్ చేసి తెలుపొచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీవీ మాల్ సూపర్ వైజర్ రమేశ్, హెడ్ కానిస్టేబుల్ నాగయ్య, కానిస్టేబుల్ రాంబాబు, హోంగార్డ్ రాజు పాల్గొన్నారు.