రుద్రంపూర్, సెప్టెంబర్ 01 : రుద్రంపూర్ పంచాయతీ పరిధిలో పట్టపగలే ఆటో ట్రాలీ బ్యాటరీ చోరీకి గురైన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలో దహన సంస్కారాల నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న ఎన్.డి. రేవంత్ తన ఆటో ట్రాలీని రోజు మాదిరిగానే రుద్రంపూర్ మార్కెట్ కాంప్లెక్స్ సమీపంలోని సులబ్ కాంప్లెక్స్ ప్రాంతంలో నిలిపి ఉంచాడు. మంగళవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు ఆటో ట్రాలీకి చెందిన సుమారు రూ.5 వేల విలువైన బ్యాటరీని చోరీ చేసినట్లు గుర్తించాడు. దీంతో బాధితుడు వెంటనే టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. గత కొన్ని రోజులుగా ఆటోల టైర్లు, బ్యాటరీల చోరీలు తగ్గుముఖం పట్టాయని భావిస్తున్న సమయంలో మళ్లీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. రుద్రంపూర్ ప్రాంతంలో పెరుగుతున్న చోరీలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.