భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని అశ్వాపురం మండల పరిధిలోని ఆమెర్ద కాలనీలో ఓ బాలికను దుండగులు కిడ్నాప్‌కు యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. రోడ్డు మీద నిలబడి ఉన్న 10 సంవత్సరాల పాపను దుండగులు కారులో కి బలవంతంగా కారులోకి ఎక్కించుకొని వెళ్లారు.
ఈ క్రమంలోపాప బిగ్గరగా అరిచి, కారు డోర్ తీసుకొని దూకింది. గ్రామస్థులు అందరు అడ్డు తిరగడంతో దుండగులు పారిపోయారు. దుండగులు బ్లాక్ కలర్ కారులో వచ్చినట్లు పాప, గ్రామస్థులు తెలిపారు. కారులో మారణాయుధాలు ఉన్నట్లు సమాచారం.