– బూర్గంపహాడ్‌లో నల్లబ్యాడ్జీలతో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన
బూర్గంపహాడ్, సెప్టెంబరు 07 : బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలపై దాడిచేసి అవమాన పర్చినందుకు ప్రభుత్వంపై మండిపడుతూ బూర్గంపహాడ్ మండల కేంద్రంలో మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత ఆధ్వర్యంలో సోమవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి వెళ్తున్న మహిళా ఎమ్మెల్యేను జుట్టుపట్టుకుని బయటకు పంపించడం చాలా బాధాకరమని, దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా మహిళలకు ఇంత అవమానం జరుగుతుంటే సీఎం రేవంత్‌కు కనిపించడం లేదా…ఇది ప్రజాస్వామ్యమ్యా లేక నియంతృత్వమా అంటూ ప్రశ్నించారు.
మహిళల జుట్టు పట్టుకోవడం, చీర లాగడం ఇవన్నీ సీఎం రేవంత్ పాలనలో మాత్రమే జరుగుతున్నట్లు దుయ్యబట్టారు. తక్షణమే సీఎం స్పందించి బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని, లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మాజీ ఎంపీటీసీ వెంకటరమణ, సారపాక పట్టణ అధ్యక్షుడు కొనకంచి శ్రీను, గోనెల నాని, దారం కృష్ణారెడ్డి, సాధిక్‌పాషా, బెజ్జంకి కనకాచారి, సోము లక్ష్మిచైతన్యరెడ్డి, పూర్ణ, భూపెల్లి నర్సింహారావు, గుల్మహ్మద్, సాలయ్య, సర్పంచ్ గుమ్మడి కృష్ణవేణి, మండల నాయకులు, అనుబంధ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.