దమ్మపేట: మండల కేంద్రమైన దమ్మపేటలోని సాయి బాబా ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే మెచ్చాను ఆలయకమిటీ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం మెచ్చాకు ఆలయకమిటీ నిర్వాహకులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, ఉపసర్పంచ్ దారా యుగంధర్, పట్టణ అధ్యక్షుడు యార్లగడ్డ బాబు, మండల టీఆర్ఎస్ యువజన అధ్యక్షులు చామర్తి గోపీశాస్త్రి, పానుగంటి చిట్టిబాబు, అబ్దుల్ జిన్నా, ఆలయకమిటీ సభ్యులు ఉన్నారు.