Ramavaram : ముస్లింలు ‘ఆశ’ స్కాలర్షిప్లను సద్వినియోగం చేసుకోవాలి : యాకూబ్ పాషా
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ వారు అందిస్తున్న"ఆశ" స్కాలర్షిప్నకు అర్హులైన ముస్లిం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ.యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
రామవరం, నవంబర్ 06 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ వారు అందిస్తున్న”ఆశ” స్కాలర్షిప్నకు అర్హులైన ముస్లిం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ.యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్దులకు రూ.15 వేలు, డిగ్రీ విద్యార్దులకు రూ.75 వేలు, పీజీ విద్యార్దులకు రూ.2.50 లక్షలు, ఐఐటి విద్యార్దులకు రూ.2 లక్షలు, ఐఐఎం విద్యార్థులకు రూ.5 లక్షలు, వైద్య విధ్యార్థులకు రూ.4.50 లక్షల చొప్పున, అలాగే విదేశాల్లో చదువుతున్న వారికి రూ.20 లక్షలు సంవత్సరానికి అందజేయటం జరుగుతుందన్నారు.
విద్యార్దులు గత సంవత్సరంలో సాధించిన పరీక్షా ఫలితాల్లో 75 శాతం మార్కులు పొంది, కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల నుండి 6 లక్షల లోపు కలిగిన భారతీయ విద్యార్థులందరు ఈ స్కాలర్షిప్ పొందేందుకు అర్హులన్నారు. అర్హత, ఆసక్తి కల విద్యార్థులు ఈ నెల 15వ తేదీ లోపు www.sbifashascholarship.org/ వెబ్ సైట్ నందు తమ మార్కుల జాబితా, ఆధార్, ఫీజులు చెల్లించిన రశీదు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ పాస్ పుస్తకం, ఫొటోతో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్దిని, విద్యార్దులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇతర వివరాల కోసం 8520860785, 8886934260 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

