భద్రాచలం, ఏప్రిల్ 07 : భద్రాచలం ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ముదిగొండ రామకృష్ణ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ చేతుల మీదుగా ప్రశంసా పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ..ఈ గుర్తింపు తనకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. భవిష్యత్లో మరింత సమర్థవంతంగా సేవలు అందించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. అటవీ ప్రాంతాలు, దూర గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులకు సమయానికి వైద్య సేవలు అందేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు.
అలాగే ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ, రోగ నిరోధక చర్యలపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నామని, ప్రభుత్వం అందిస్తున్న సహకారం, వైద్య సిబ్బంది కృషి, సహచరుల మద్దతుతోనే ఈ స్థాయి గుర్తింపు సాధ్యమైందని డాక్టర్ రామకృష్ణ తెలిపారు. అదేవిధంగా భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పని చేస్తున్న డాక్టర్ క్రాపా విజయ్, నర్సింగ్ అధికారిణి కృష్ణవేణి, ఎ.వెంకటరావుకు ప్రశంసా పురస్కారాలు దక్కాయి.