రామవరం, జూలై 30 : సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్, సి.సి.సి, నస్పూర్ నందు 2025-26 విద్యా సంవత్సరంలో సింగరేణి కోటా నందు మిగిలి ఉన్న 66 సీట్లు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్ – 27, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ – 6, మెకానికల్ – 23, మైనింగ్ – 10 సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సింగరేణి సంస్థ నందు పని చేస్తున్న అధికారులు, ఉద్యోగుల పిల్లలు పైన తెలిపిన కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు అర్హులన్నారు. ప్రవేశాలు పొందగోరే వారికి తప్పక ఉండాల్సిన అర్హతులు
1. సింగరేణి ఉద్యోగులు /మాజీ ఉద్యోగుల పిల్లలకు తొలి ప్రాధాన్యత
2. స్పాట్ అడ్మిషన్లో సీటు వచ్చిన విద్యార్థులకు స్కాలర్ షిప్ వర్తించదు
3. విద్యార్థులు బయో మెట్రిక్ అటెండెన్స్ కోసం ఆధార్ అప్డేట్ చేసుకోవాలి
4. కౌన్సిలింగ్ తేదీ 07 ఆగస్టు, 2025 ఉదయం 08.00 గంటలకు
5. ఉదయం 09.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9010322161, 8332972597, 8790112513.
రిజిస్ట్రేషన్ వివరాలు కోసం www.scp.scpolytechnic.com సందర్శించగలరు. స్పాట్ అడ్మిషన్స్ కు పాలిసెట్ 2025 లో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులతో సీట్లను భర్తీ చేయబడును. ప్రవేశం కోసం వచ్చే విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు మూడు (3) సెట్లు జిరాక్స్ కాపీలు, మూడు(3) కలర్ పాస్ పోర్ట్ ఫోటోలు, దరఖాస్తుతో జతపరిచి కౌన్సిలింగ్ రోజు (07.08.2025 ) నాడు తీసుకురావాలని పేర్కొన్నారు.