‘పోషకాహారం, విద్య, ఆరోగ్యానికి నిలయాలు అంగన్వాడీ కేంద్రాలు’
పోషకాహారం, విద్య, ఆరోగ్యం పట్ల అంగన్వాడీ టీచర్లు, ఆయాల శ్రమ వెలకట్టలేనిదని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ కొనియాడారు. గురువారం 16వ డివిజన్ నెహ్రూ బస్తీ సెంటర్లో జరిగిన పోషణ్ పక్వాడ్ లో కార్యక్రమంలో మాట్లాడుతూ..
రుద్రంపూర్, ఏప్రిల్ 16 : పోషకాహారం, విద్య, ఆరోగ్యం పట్ల అంగన్వాడీ టీచర్లు, ఆయాల శ్రమ వెలకట్టలేనిదని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ కొనియాడారు. గురువారం 16వ డివిజన్ నెహ్రూ బస్తీ సెంటర్లో జరిగిన పోషణ్ పక్వాడ్ లో కార్యక్రమంలో మాట్లాడుతూ.. పోషకాహారం తల్లి, పిల్లలు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం నెలకొల్పవచ్చు అన్నారు. అలాగే కార్పొరేట్ శక్తులు విద్యను వ్యాపారం చేసే ఈ రోజుల్లో అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్లు పిల్లలను అంగన్వాడీ సెంటర్లకు తీసుకెళ్లి వారికి పోషకాహారం, విద్య, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ వారిని ఆరోగ్యకరమైన పిల్లలుగా తయారు చేస్తున్న వారి కృషి అమోఘమని ఆమె అన్నారు.
అనంతరం సెంటర్లో చిన్నారులకు అన్న ప్రసన, అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. పోషక విలువలతో కూడిన పోషకాహార ప్రదర్శన నిర్వహించి పిల్లలను ఆకట్టుకున్నారు. తన కుమారుడికి అక్షరాభ్యాసం నిర్వహించుకున్న తీట్ల దివాకర్ అంగన్వాడీ సెంటర్లలోని చిన్నారులకు పలక, బలపాలని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ పార్వతి, అంగన్వాడీ టీచర్స్ సరోజ, డి.నీలవేణి, షహనాజ్, దేవి, రజిత, ఆయాలు వెంకటలక్ష్మి, కౌసల్య, కొమరమ్మ, తల్లిదండ్రులు తీట్ల దివాకర్, కంచర్ల శ్రావణి, సంతోషి, ఎస్ కే ఫైజా, జాన్ నవీన్, జి.రుత్విక్, రవి, విన్సీ, ప్రసన్న, జి.నాగలక్ష్మి, లీల, రమ్య పాల్గొన్నారు.

‘పోషకాహారం, విద్య, ఆరోగ్యానికి నిలయాలు అంగన్వాడీ కేంద్రాలు’
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

