బూర్గంపహాడ్, జూలై 20 : పారిశ్రామిక ప్రాంతమైన సారపాక 4వ వార్డులో పాత బావిని పూడ్చి ఆ స్థలంలో అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్షీ) ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్, బీజేపీ నాయకులతో కలిసి వార్డు ప్రజలు ఐటీసీ యాజమాన్యం, ప్రజా ప్రతినిధులను కోరారు. 45 ఏళ్ల క్రితం ఐటీసీ పీఎస్పీడీ నిర్మించిన తాగునీటి బావి ప్రస్తుతం వాడకంలో లేకపోవడంతో అందులో వర్షపు నీరు నిల్వ ఉంటోందని, దోమలు పెరిగి ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కావునా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ బావిని పూడ్పించి ఆ స్థలంలో అంగన్వాడీ కేంద్రంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించాలని కోరారు. ఈ మేరకు ఐటీసీ యాజమాన్యానికి, స్థానిక సర్పంచ్‌కు వినతిపత్రం అందజేసినట్లు వెల్లడించారు. వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు కొనకంచి శ్రీను, బానోతు శ్రీను, బీజేపీ నాయకుడు చుక్కపల్లి బాలాజీ ఉన్నారు.