రామవరం, ఏప్రిల్ 23 : ఉగ్రవాదానికి, మతోన్మాదానికి మానవత్వంతో సంబంధం ఉండదని, అరాచక శక్తులను కూకటివేళ్లతో పెకిలించాలని రుద్రంపూర్ ముస్లిం మత పెద్దలు అన్నారు. బుధవారం చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని మసిదే-ఏ క్యూబాలో మధ్యాహ్నం నమాజ్ అనంతరం స్పందిస్తూ జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేసి చంపడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. ఇలాంటి దారుణానికి కులం, మతంతో ఎలాంటి సంబంధం లేదని, అలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని కోరారు.
ఖురాన్ లో అల్లాహ్ ఒక మనిషి ప్రాణాన్ని తీయడం అంటే యావత్ మానవాళి ప్రాణం తీసినట్లు అని, ఒక మనిషి ప్రాణం కాపాడితే యావత్ మానవాళి ప్రాణం కాపాడినట్లు అని హితబోధ చేసినట్లు, అంతటి గొప్ప మతంలో హింసకు తావు లేదన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాలకు స్వస్తి పలికి కులమతాల మధ్య శాంతి సామరస్యం కోసం, కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ రఫీ, షేక్ సోనీ సాహెబ్, ఆలం, నవాజిస్, షమీం, ఖాసీం, మదర్ సాబ్, మహమ్మద్ ఉమర్, రఫీ, సలీం, ఆసిఫ్, అక్రమ్ పాల్గొన్నారు.