కొత్తగూడెం అర్బన్, మే 19 : కొత్తగూడెం మున్సిపల్ శాఖలో పారిశుధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న మేడి హరి కుమారుడు మేడి సోమశేఖర్ (15) అనుమానాస్పద మృతిపై న్యాయ విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా సంబంధిత పోలీస్ శాఖ అధికారులను కోరారు. సోమశేఖర్ మృతదేహాన్ని సోమవారం కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో సందర్శించి ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ సందర్బంగా సాబీర్ పాషా మాట్లాడుతూ సోమశేఖర్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, ఈ అనుమానాలను నివృత్తి చేయాలనీ, న్యాయ విచారణ జరిపి కుటుంబానికి న్యాయం చేయాలనీ కోరారు. నివాళులర్పించిన వారిలో పార్టీ నాయకులు లగడపాటి రమేశ్, బత్తుల నాగరాజు, నవీన్, సుధాకర్ ఉన్నారు.