చుంచుపల్లి, జూలై 28 : రేషన్ కార్డు ద్వారా అన్ని రకాల నిత్యవసర వస్తువులను అందజేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. చుంచుపల్లి మండల పరిధిలోని ఎన్. కె. నగర్ గ్రామం నందుగల కమ్మ సత్రంలో మండల డిప్యూటీ తాసీల్దార్ వినయశీల ఆధ్వర్యంలో సోమవారం నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కూనంనేని హాజరై మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు.
లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయడం హర్షనీయం అన్నారు. మండలంలో సుమారు 1,156 కొత్త కార్డులకు గాను 8,56 కార్డులు మంజూరు అయినట్లు అధికారులు తెలుపగా ఎమ్మెల్యే మండల సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు, సీపీఐ మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి, పోలమూరి శ్రీనివాస్, యాండ్ర మహేశ్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ, మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.