– ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో కార్మికుల నిరసన
బూర్గంపహాడ్, ఏప్రిల్ 17 : 14వ వేతన ఒప్పంద ప్రక్రియను జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఐఎన్టీయూసీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం కార్మిక నాయకులు, కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోనె రామారావు, యారం పిచ్చిరెడ్డి మాట్లాడుతూ 14వ వేతన ఒప్పంద చర్చలు ఆరు నెలలుగా సాగుతున్నా నేటికీ ఒప్పందం పూర్తి చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. వేతన ఒప్పందంలో కొత్తగా బోనస్ స్కీమ్లు, బీసీటీఎంపీ స్కీమ్ల వంటివి లేకపోయినా ఒప్పంద చర్చలు ఇంత సుదీర్ఘకాలంగా సాగడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు.
యాజమాన్యం వేతన ఒప్పంద ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని లేనిపక్షంలో ఐఎన్టీయూసీ మిత్రపక్షాలు ఆందోళన తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు. ఈ వేతన ఒప్పంద ప్రక్రియలో గుర్తింపు సంఘం ఏ లాలూచీలకు పోకుండా కార్మికుల న్యాయమైన డిమాండ్లు సాధించే దిశగా పని చేయాలన్నారు. రూ.22 వేల ప్యాకేజీ షరతులు లేని నూరు శాతం అన్లిమిటెడ్ మెడికల్ రిటైర్మెంట్ ట్ కార్మికులకు రూ.12 లక్షలు బెనిఫిట్ ఖచ్చితంగా సాధించాలని డిమాండ్ చేశారు.