– గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్
ఇల్లెందు, డిసెంబర్ 04 : ఇల్లెందు మండలం రొంపేడు గ్రామానికి చెందిన సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మాజీ సర్పంచ్ అజ్మీర శంకర్‌తో పాటు 50 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ సమక్షంలో గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమ నేత, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ అజ్మీర భావ సింగ్ ఆధ్వర్యంలో వారు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికీ హరిప్రియ నాయక్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో గ్రామాలు అభివృద్ధి చెందిన తీరును చూసి, భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదేనని, కేసీఆర్ పాలనలో గిరిజన తండాలను, గుడాలను పంచాయితీలుగా చేసి అభివృద్ధి చేసిన విధానంపై నమ్మకంతో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని ఆమె అన్నారు.
కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనలో ప్రజలు విసుగు చెంది మళ్లీ కేసీఆర్ కావాలని బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో ఇల్లెందు నియోజకవర్గం నుండి అత్యధికంగా స్థానాలను బీఆర్ఎస్ కైవస్యం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో ముఖ్యులు అజ్మీర జోగ్య, మూడ్ బలరాం, శారద, వాంకుడోత్ రవి, అజ్మీరా రవి, కిరణ్, పద్మ, ధర్మసోద్ లక్ష్మి, శిరీష, మారి, బద్రి ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అజ్మీర రాంబాబు, మూడ్ హనుమాన్, గుగులోత్ సోమన్న, బానోత్ మోతిలాల్ పాల్గొన్నారు.