రామవరం, ఆగస్టు 28 : కార్మికులకు ఆదాయ పన్ను రద్దు చేయాలని, పెర్క్స్ మీద పన్ను యాజమాన్యమే చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ అనుబంధ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ అన్నారు. గురువారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని వికే సెవెన్ ఓసీ, పీవీకే పైవ్ షాప్ట్, ఆర్ సి హెచ్ పి, ఎస్ అండ్ పి సి, జెవిఆర్ఓసి, కిష్టారంలో కాపు కృష్ణ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వీకే సెవెన్ ఓసి మేనేజర్ మురళికి మెమొరండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
1) వాస్తవ లాభాలపై 35 శాతం వాటా ప్రకటించాలి
2) అనారోగ్య సమస్యలతో మెడికల్ బోర్డుకు వెళ్లే కార్మికులందరిని అన్‌ఫిట్ చేయాలి
3) జూలై నెలలో ఫిట్ ఫర్ సేమ్ జాబ్ ఉత్తర్వులు ఇచ్చిన 50 మందికి తిరిగి మెడికల్‌కు పిలిచి వారందరిని అన్‌ఫిట్ చేయాలి
4) వేలం పాటతో సంబంధం లేకుండా సింగరేణి నూతన బొగ్గు గనులను కేటాయించాలి
5) సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.43 వేల కోట్ల బకాయిలను ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పించాలని డిమాండ్
6) మెడికల్, ట్రైనింగ్ అయిన డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలి.
ఈ మెమొరండను యాజమాన్యం వారికి పంపి వెంటనే పరిష్కారం అయ్యే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య, సెంట్రల్ కమిటీ సభ్యుడు ఈశ్వర్, బ్రాంచ్ సెక్రటరీలు అశోక్, రాజ్ కుమార్, గణేశ్, సాగర్, పిట్ సెక్రటరీలు వెంకటేశ్వర్లు, శ్రీరామ్మూర్తి, రాజేశ్వరరావు, రవీందర్, ప్రభాకర్, రఫీ, హనుమంతు, శ్రీనివాస్, రాజేశ్, అనుదీప్,శ్రీనివాస్, ప్రభాకర్, వెంకటరావు, కార్మికులు పాల్గొన్నారు.
Ramavaram : వాస్తవ లాభాలపై 35 శాతం వాటా ప్రకటించాలి : కాపు కృష్ణ