
కర్షకులకు రుణమాఫీ
నాడు రూ.25 వేలు.. ప్రస్తుతం రూ.50 వేలు మాఫీ
ఉమ్మడి జిల్లాలో రూ.172 కోట్ల రుణాలు
ఖమ్మం జిల్లాలో 33,575, భద్రాద్రిలో 20,073 మంది రైతులకు లబ్ధి
కొత్తగూడెం, ఖమ్మం వ్యవసాయం ఆగస్టు 16 ;రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ ప్రక్రియ అమల్లోకి వచ్చింది. రూ.25 వేలు తీసుకున్న రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేసింది. తాజాగా రూ.50 వేలు పొందిన రైతులకూ రుణమాఫీ చేస్తూ జీవో జారీ చేసింది. దీంతో తమ ఖాతాల్లో నగదు జమ అవుతుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఖమ్మం జిల్లాలో 33,575 మంది, భద్రాద్రి జిల్లాలో 20,073 మంది రైతులకు లబ్ధి చేకూరనున్నది.
గతేడాది రూ.25 వేలు రుణం తీసుకున్న రైతులకు రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం.. తాజాగా రూ.50 వేలు పొందిన రైతులకూ రుణమాఫీ చేస్తూ జీవో జారీ చేసింది. దీంతో నిన్నటి నుంచి రైతులు ఖాతాల్లో రుణమాఫీ సొమ్ములు జమ అవుతున్నాయి. పంటలు, సాగు విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరాలోనూ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నది. నాడు దూర ప్రాంతాలకు వెళ్లి పంటలను అమ్ముకునే పరిస్థితి నుంచి రైతన్నలను విముక్తి చేసింది.
జిల్లాలో రూ.63.62 కోట్ల రుణమాఫీ..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా వివిధ బ్యాంకుల ద్వారా రుణమాఫీ చేస్తోంది. 2018 కంటే ముందు జిల్లాలోని బ్యాంకుల్లో రైతులు రుణాలు తీసుకున్నారు. రూ.లక్షలోపు పంట రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విడతల వారీగా రైతులకు సంబంధించిన క్రాప్ లోన్లను సర్కార్ మాఫీ చేస్తోంది. మొదటి విడతలో రూ.25 వేల లోపు వివిధ బ్యాంకుల్లో రైతులు తీసుకున్న లోన్లను ప్రభుత్వం మాఫీ చేసింది. జిల్లాలో 15,023 మంది రైతులకు సంబంధించిన రూ.17 కోట్లను ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఇప్పటికే మొదటి విడత రుణమాఫీ చేసిన సర్కార్ సోమవారం నుంచి రెండో విడత రుణమాఫీ అమలు చేస్తున్నది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో 20,073 మంది రైతులకు ప్రయోజనం చేకూరనున్నది. జిల్లాలో రూ.50 వేల వరకు క్రాప్‌లోన్ తీసుకున్న రైతులకు సంబంధించిన రూ.63.62 కోట్లను ప్రభుత్వం మాఫీ చేస్తుంది. రుణమాఫీకి సంబంధించిన డబ్బులు నేటి నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. తొలిరోజు 71 మందికిగాను రూ.17 లక్షల సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి.
గతేడాది రూ.25 వేలు రుణం తీసుకున్న రైతులకు రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం.. తాజాగా రూ.50 వేలు పొందిన రైతులకూ రుణమాఫీ చేస్తూ జీవో జారీ చేసింది. దీంతో నిన్నటి నుంచి రైతులు ఖాతాల్లో రుణమాఫీ సొమ్ములు జమ అవుతున్నాయి. పంటలు, సాగు విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరాలోనూ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నది. నాడు దూర ప్రాంతాలకు వెళ్లి పంటలను అమ్ముకునే పరిస్థితి నుంచి రైతన్నలను విముక్తి చేసింది.
ఖమ్మం జిల్లాలో 33,575 మంది రైతులకు లబ్ధి
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రుణమాఫీ ప్రక్రియ అమల్లోకి వచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం రూ.25 వేలలోపు పంట రుణాలు తీసుకున్నవారికి నిధులను అకౌంట్లోకి జమ చేసింది. రెండో విడతకు సంబంధించి రూ.25నుంచి రూ.50వేల రుణాలు తీసుకున్నవారికి రుణమాఫీ జరగనున్నది. జిల్లాలో 33,575 మంది రైతులకు ప్రయోజనం చేకూరనున్నది. రూ.106.88 కోట్లు రుణాలు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. తొలిరోజు రూ.25నుంచి రూ.26వేల పంట రుణాలు తీసుకున్న 67 మంది రైతులకు సుమారు రూ.16 లక్షలు రైతుల అకౌంట్లో సర్కార్ జమ చేసింది. ఇదేతరహాలో అదనంగా తీసుకున్న రైతుల అకౌంట్లలో రోజుకు రూ.వేయి రుణమాఫీ నిధులు జమకానున్నాయి.
బ్యాంకులో రుణమాఫీ డబ్బులు పడ్డాయి..
నేను పాల్వంచ బ్యాంకులో రూ.23,003 పంట రుణం కింద తీసుకున్నాను. సీఎం కేసీఆర్ సార్ చెప్పిన విధంగానే రుణమాఫీ చేశారు. బ్యాంకు ఖాతాలో రుణమాఫీ డబ్బులు పడ్డాయి. సార్ చల్లగా ఉండాలి. అప్పుడు కూడా రుణమాఫీ అయింది. రైతు బందు డబ్బులు వచ్చాయి. పంట పెట్టుబడికి మరింత సాయం అందింది. చాలా సంతోషంగా ఉంది. సీఎం సార్‌కు ధన్యవాదాలు .
-ఏలూరి వెంకటరమణ, గంగదేవిగుప్ప, పాల్వంచ మండలం
రైతుల ఖాతాల్లో జమ
ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ సొమ్ము బ్యాంకుల్లో జమ చేసింది. తొలిరోజు 71 మందికి నగదు జమ అయ్యింది. అర్హులందరికీ రుణాలు మాఫీ అవుతున్నాయి. ఇప్పటికే రైతుబంధు సొమ్ము కూడా జమ అయ్యింది. రైతుబీమా ప్రీమియం చెల్లిస్తున్నారు. కొత్త రైతులనూ రైతు బీమాలో చేర్చుతున్నాం.