రామవరం, ఏప్రిల్ 3 : గత ఆర్థిక సంవత్సరం 2024-25 నకు కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 143 లక్షల టన్నులు (వీకేఓసి కు నిర్దేశించిన లక్ష్యాన్ని మినహాయింపు చేసి) గాను 144.18 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని 100.5% తో సాధించినట్లు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు తెలిపారు. గురువారం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బొగ్గు ఉత్పత్తి సాధనలో ప్రధాన పాత్ర పోషించిన జే.వి.ఆర్ ఓసి ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 112 లక్షల టన్నులకు గాను 114.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని నేటి వరకు రక్షణతో సాధించి సింగరేణి సంస్థకు పెద్దన్న పాత్ర పోషిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాగే రానున్న ఆర్థిక సంవత్సరాల్లో కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ సింగరేణి అభివృద్ధిలో ముందువరుసలో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఏరియా ఉద్యోగులకు, అధికారులకు , యూనియన్ ప్రతినిధులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగూడెం ఏరియా బొగ్గు ఉత్పత్తిలో నెలకొల్పిన రికార్డులను జీఎం వెల్లడించారు.
– కొత్తగూడెం ఏరియా నందు బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైనప్పటి నుండి ఈ ఆర్థిక సంవత్సరంలోనే 114.18 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసింది.
– జేవిఆర్ ఓసీ-2 ఈ ఆర్థిక సంవత్సరంలో 114.58 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసింది.
– కిష్టారం ఓసీ ఈ ఆర్థిక సంవత్సరంలో 28.00 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసింది.
– కొత్తగూడెం ఏరియా నందు ఉత్పత్తి అయిన బొగ్గు రవాణా ప్రారంభమైనప్పటి నుండి ఈ ఆర్థిక సంవత్సరంలోనే 162.39 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసింది.
– రైలు మార్గం ద్వారా కొత్తగూడెం ఏరియా ఈ ఆర్థిక సంవత్సరంలోనే 145.16 లక్షల టన్నులు బొగ్గు రవాణా చేసింది.
– ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఒక్క రోజుకు గాను అత్యధిక బొగ్గు రవాణా 80,931 టన్నులు బొగ్గు రవాణా చేసింది.
– ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఒక్క రోజుకు గాను అత్యధిక బొగ్గు రవాణా 17 రేకుల బొగ్గు రవాణా చేసింది.
– ఈ ఆర్థిక సంవత్సరంలోనే మార్చి నెల గాను అత్యధికంగా 249 (జే వి ఆర్ సి హెచ్ పి నుండి) రేకులు బొగ్గు రవాణా చేయడం జరిగింది.
– ఈ ఆర్థిక సంవత్సరంలోనే రైలు మార్గం ద్వారా అత్యధిక రేకులు 3621(జేవిఆర్ సిహెచ్ పి నుండి 2674 అలాగే ఆర్.సి.హెచ్.పి నుండి 947) రవాణా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జి కే ఓ సి ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేశ్, ఏరియా, ఇంజినీర్ కె.సూర్యనారాయణ రాజు, డిజిఎం (పర్సనల్) బి.శివకేశవరావు, ఏజిఎం (సివిల్) సీహెచ్ రామకృష్ణ, డిజిఎం (ఐఈడి) ఎన్.మోహన్, వర్క్ షాప్ డిజిఎం శ్రీకాంత్, ఇతర శాఖ అధిపతులు పాల్గొన్నారు.