
జూలూరుపాడు, జూలై 5: సమన్వయంతో పని చేస్తూ గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయి అధికారులు పల్లె ప్రగతి పనుల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. దీంతో గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని గుండెపుడి గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన గ్రామసభలో ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రామసభ ముగిసిన తర్వాత గ్రామంలో పాదయాత్ర నిర్వహించి పారిశుధ్య పనులను పరిశీలించారు. తొలుత పంచాయతీ కార్యాలయ సమీపంలో మొక్కలు నాటారు. సర్పంచ్ బానోత్ నర్సింహారావు, ఎంపీపీ లావుడ్యా సోని, జడ్పీటీసీ భూక్యా కళావతి, వైస్ ఎంపీపీ గాదె నిర్మల, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంపీవో రామారావు, ఇన్చార్జి ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు, ప్రభుత్వ వైద్యులు వీరబాబు, ఎంఈవో గుగులోత్ వెంకట్, ఏవో రఘుదీపిక, పీఆర్ ఏఈ శివలాల్, విద్యుత్ శాఖాధికారి ఆకుల రఘురామయ్య, ఎంపీటీసీలు దుద్దుకూరి మధుసూదన్‌రావు, పెండేల రాజశేఖర్ గ్రామ స్పెషలాఫీసర్ రమేశ్ పాల్గొన్నారు.