మధిర : గ్రామాల్లో నేరాల నివారణకు సీసీకెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వైరా ఏసీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం మధిర రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో గల మాటూరుపేట గ్రామంలో సీసీకెమెరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. గ్రామంలో పోలీసులుపరంగా పరిష్కరించాల్సిన సమస్యలు, ఫ్రెండ్లీ పోలీసింగ్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మధిర సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒ. మురళీ, మధిర రూరల్ ఎస్సై రమేష్ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.