కారేపల్లి, నవంబర్ 19 : కారేపల్లి కస్తూర్భాగాంధీ విద్యాలయంలో బుధవారం బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చైల్డ్ రైట్ కన్వెషన్ వీక్ ను పురష్కరించుకుని విద్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్ధినులు నాటికలు, పాటలతో అవగాహన కల్పించారు. బాల్య వివాహాలతో అనేక అనర్ధాలు చోటుచేసుకుంటాయన్నారు. బాలికలు మానసికంగా, శరీరకంగా ఎదుగుల లేకుండా వివాహాలు చేయడం చట్ట విరుద్దమని విద్యాలయ స్పెషల్ ఆఫీసర్ సౌజన్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మమత, సీహెచ్.ఝాన్సీ, స్వాతి, ఎండీ.షాహినా సుల్తానా, బి.రమ పాల్గొన్నారు.