కల్లూరు: మండల పరిధిలోని పెద్దకోరుకొండి, చిన్నకోరుకొండి గ్రామాల్లోని రైతులకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సత్తుపల్లి సహాయ వ్యవసాయ సంచాలకులు యు.నర్సింహారావు ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ యాసంగిలో వరిసాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన మినుము, పెసర, పొద్దుతిరుగుడు, వేరుశెనగ, నువ్వులు తదితర పంటలు సాగుచేయాలని సూచించారు.
మండల వ్యవసాయాధికారి రూప మాట్లాడుతూ రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించి వరికి బదులుగా వాటిని సాగుచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ఈ సదస్సులో వ్యవసాయ విస్తరణ అధికారులు కె.నరేష్, ఐ.సాయివాసంతి, ఎంపీటీసీ చిట్టిబాబు, రైతులు జ్యేష్ట వెంకటేశ్వర్లు, మచ్చా హనుమంతరావు, నలజాల మంగపతి, నున్నా నాగార్జున తదితరులు పాల్గొన్నారు.