కారేపల్లి, మే 06 : స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మిక చట్టాల రద్దు నిరసిస్తూ ఖమ్మం జిల్లా కారేపల్లి మండల ఆశా వర్కర్లు మంగళవారం మండల వైద్యాధికారి డాక్టర్ సురేశ్ సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ కె.నరేంద్ర మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించడం లేదన్నారు.
క్షేత్రస్ధాయిలో వైద్య సేవలు, వైద్య సర్వేలు నిర్వహిస్తున్న ఆశ వర్కర్ల పట్ల వివక్ష వీడాలన్నారు. ఆశాల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న జరిగే సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెల్త్ వర్కర్స్ యూనియన్ నాయకురాళ్లు ఎల్లెబోయిన రాధా, జంగ కళ్యాణి, పద్మ, రాజేశ్వరి, ఆదెర్ల దేవకరణ, సీహెచ్.పుష్పలత, ఈశ్వరి, మంగ, కుమారి, సరస్వతి, చంద్రమ్మ, నర్సమ్మ పాల్గొన్నారు.