మధిర, మార్చి 20 : పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి వై.ప్రభాకర్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ… శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మధిర టౌన్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (సీపీఎస్)లో 180 మంది, టీవీఎం ఉన్నత పాఠశాలలో 230 మంది, బాలికల ఉన్నత పాఠశాలలో 160 మంది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (హ. వా)లో 160 మంది విద్యార్థులు, అదేవిధంగా మండలంలోని సిరిపురం ఉన్నత పాఠశాలలో 257 మంది మొత్తంగా మధిర మండలం నుంచి 1,049 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు వెల్లడించారు.
అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, ఫర్నిచర్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్షా కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ గా తోట నరసింహారావు, మురళీమోహన్, డి వెంకటేశ్వర్లు, విజయశ్రీ, సాధు సమాధానం, కొమ్ము శ్రీను, వెంకట్రావమ్మ, స్వప్న, నారాయణ దాస్, వీరయ్య, కస్టోడియన్ ఎస్ కె నాగూర్ వలి, సి సెంటర్ కస్టోడియన్ పోలె సుధాకర్ బాధ్యతలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని సూచించారు.