కారేపల్లి : కశ్మీర్ లోయలో ఇటీవల ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలం సూర్య తండాకు చెందిన సైనికుడు బానోతు అనిల్ మృతి చెందారు. ఆర్మీ అధికారుల బృందం బుధవారం అనిల్ భౌతికకాయా కారేపల్లి మండలంలోని అతని స్వగ్రామమైన సూర్య తండాకు తీసుకువచ్చారు.
కామేపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో అనిల్ భౌతికకాయానికి ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యుడు కోరం కనకయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కారేపల్లి క్రాస్ రోడ్ నుంచి భారీగా తరలివచ్చిన జనంతో అనిల్ భౌతికకాయాన్ని ర్యాలీగా సూర్యతండాకు తీసుకువెళ్లారు. కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఆ తర్వాత అనిల్ భౌతికకాయాకి ఇండియన్ ఆర్మీ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.