బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు నియోజకవర్గ ఇన్చార్జీల నియామకం
బీఆర్ఎస్ను క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయడంతోపాటు సభ్యత్వ నమోదును వేగవంతం చేసేందుకు సంస్థాగత చర్యలకు పార్టీ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సభ్యత్వ నమోదు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జిగా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావును పార్టీ అధిష్టానం నియమించిన విషయం విదితమే.
- కొత్తగూడేనికి వద్దిరాజు, పాలేరుకు తాతా, మధిరకు నామా
- వేగంగా సభ్యత్వ నమోదు.. పార్టీ పటిష్టతకు చర్యలు..
ఖమ్మం, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ను క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయడంతోపాటు సభ్యత్వ నమోదును వేగవంతం చేసేందుకు సంస్థాగత చర్యలకు పార్టీ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సభ్యత్వ నమోదు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జిగా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావును పార్టీ అధిష్టానం నియమించిన విషయం విదితమే. సభ్యత్వ నమోదు గురించి నియోజకవర్గస్థాయి సమావేశం, మండలస్థాయి సమన్వయ కమిటీ సభ్యుల ఎంపిక పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలకు సభ్యత్వ నమోదు ఇన్చార్జీలను పార్టీ గురువారం నియమించింది.
కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జిగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, పాలేరు నియోజకవర్గ ఇన్చార్జిగా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మధిర నియోజకవర్గ ఇన్చార్జిగా నామా నాగేశ్వరరావు, వైరా నియోజకవర్గ ఇన్చార్జిగా ఆర్జేసీ కృష్ణ, సత్తుపల్లికి కూరాకుల నాగభూషణం, ఇల్లెందుకు చాడా కిషన్రెడ్డి, పినపాకకు దిండిగాల రాజేందర్, అశ్వారావుపేటకు ఉప్పల వెంకటరమణ, భద్రాచలానికి రావులపల్లి రాంప్రసాద్, ఖమ్మానికి ఏనుగుల రాకేశ్రెడ్డిలను నియమించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జితో సమన్వయం చేసుకొని సభ్యత్వ నమోదును వేగవంతం చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు పార్టీ నిర్మాణంపై దిశా నిర్దేశం చేయనున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

