బోనకల్లు: రైతుబంధు పథకం కోసం మండలంలోని రైతులు దరఖాస్తు చేసుకోవాలని మండల రైతుబంధు కన్వీనర్ వేమూరి ప్రసాద్ తెలిపారు. శుక్రవారం బోనకల్లులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆన్లైన్లో 10 డిసెంబర్ 2021 నాటికి కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు వచ్చిన రైతులు రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. యాసంగి రైతుబంధు పథకానికి ఏఈవో అధికారి వద్ద దరఖాస్తు ఫారాలను అందజేయాలని తెలిపారు.
దరఖాస్తు ఫారాలతో పాటు పట్టాదారు పాస్‌పుస్తకం జిరాక్స్ లేదా తహసీల్దార్ డిజిటల్ సంతకం అయిన పేపరు, ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్ జిరాక్స్‌లను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలని తెలిపారు. దరఖాస్తులను వివరాలను ఆన్లైన్ చేసి వారికి రైతుబంధు వచ్చే విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు.