బోనకల్లు, మే 06 : భూ భారతి రెవెన్యూ సదస్సులో భాగంగా ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలోని తూటికుంట్ల, సీతానగరం గ్రామాల్లో మంగళవారం రెవెన్యూ అధికారులు రైతుల నుంచి దరఖాస్తు తీసుకున్నారు. ఈ సందర్భంగా మధిర తాసీల్దార్ రాచబండి రాంబాబు, బోనకల్లు తాసీల్దార్ అనిశెట్టి పున్నం చందర్ మాట్లాడుతూ.. భూ భారతి చట్టంతో రైతులకు కలిగే ప్రయోజనాలను తెలుసుకోవాలన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం ఈ సదస్సులో దరఖాస్తులను చేసుకోవాలన్నారు. దరఖాస్తులను పరిశీలించి రైతులకు ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు మైథిలి, నవీన్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.