Shiva Jyothi | ఎట్టకేలకి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివజ్యోతి.. శుభాకాంక్షలు తెలుపుతున్న సెలబ్రిటీస్
Shiva Jyothi | సాధారణ న్యూస్ రీడర్గా కెరీర్ ప్రారంభించి సెలబ్రిటీ స్థాయికి ఎదిగిన శివజ్యోతి అలియాస్ జ్యోతక్క అలియాస్ తీన్మార్ సావిత్రి ప్రస్తుతం జీవితంలో అత్యంత ఆనందకరమైన దశలో ఉన్నారు.
Shiva Jyothi | సాధారణ న్యూస్ రీడర్గా కెరీర్ ప్రారంభించి సెలబ్రిటీ స్థాయికి ఎదిగిన శివజ్యోతి అలియాస్ జ్యోతక్క అలియాస్ తీన్మార్ సావిత్రి ప్రస్తుతం జీవితంలో అత్యంత ఆనందకరమైన దశలో ఉన్నారు. ఒక తెలుగు న్యూస్ ఛానెల్లో ‘తీన్మార్ వార్తలు’ కార్యక్రమంతో తెలంగాణ యాసలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆమె, ఆ తర్వాత రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో పాల్గొని మరింత ప్రజాదరణ పొందారు. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇల్లు, కారు, ఆర్థిక భద్రత సాధించినప్పటికీ, పెళ్లై దాదాపు పదేళ్లు గడిచినా సంతానం లేకపోవడం శివజ్యోతి దంపతులను మానసికంగా బాధించింది. అయితే గత ఏడాది గర్భం దాల్చినట్లు ప్రకటించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అప్పటి నుంచి గర్భధారణ ప్రయాణంలోని ప్రతి దశను వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పంచుకుంటూ, గర్భిణీలకు అవసరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ వచ్చారు. డెలివరీ సమయం దగ్గరపడుతున్న సమయంలో శివజ్యోతి భావోద్వేగానికి లోనయ్యారు. ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్టులో తన బిడ్డకు ఉద్దేశించి హృదయపూర్వక సందేశం రాశారు. గర్భధారణ ప్రయాణం ఎంతో ఆనందంగా సాగిందని, ఈ కాలంలో పెద్దగా ఇబ్బందులు కలగలేదని, తల్లిదండ్రులుగా తమను ఎంచుకున్నందుకు ఎప్పటికీ రుణపడి ఉంటామని పేర్కొన్నారు. త్వరలో సురక్షితంగా డెలివరీ జరగాలని ఆశిస్తున్నామని కూడా వెల్లడించారు.
అయితే తాజాగా శివజ్యోతి ఫిబ్రవరి 12వ తేదీన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఫిబ్రవరి 12న తమ ఇంటికి మూడో వ్యక్తి వచ్చారని పేర్కొన్నారు శివజ్యోతి, గంగూలీ దంపతులు. “హ్యాపీ బర్త్డే చిన్నీ… నా 33వ పుట్టినరోజుకు జీవితంలోనే బెస్ట్ గిఫ్ట్ వచ్చింది. ఫిబ్రవరి 12న మా బిడ్డ పుట్టింది అని భావోద్వేగంగా రాసుకొచ్చారు. అయితే తమకు పుట్టింది అమ్మాయా, లేక అబ్బాయా అనే విషయంపై సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. త్వరలోనే ఆ వివరాలు కూడా వెల్లడిస్తామని శివజ్యోతి పేర్కొంది. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. అభిమానులు మరియు నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీర్వాదాలు అందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

