కొత్తగూడెం అర్బన్, నవంబర్ 4 : ఉద్యోగోన్నతి పొందినా పూర్తి వేతనాలు చెల్లించకుండా.. ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మచారి మాట్లాడుతూ మినీ టీచర్ నుంచి మెయిన్ టీచర్లుగా అప్గ్రేడ్ అయి ప్రమోషన్ పొందిన అంగన్వాడీ టీచర్ల వేతనాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం, మోసం చేస్తున్నదని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం టీచర్లకు పూర్తి వేతనాలు చెల్లించడంతోపాటు అంగన్వాడీ కేంద్రాలకు హెల్పర్లను నియమించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు దొడ్డా రవికుమార్, సత్య, విజయశీల, కృష్ణవేణి, సూరమ్మ, భాను, సావిత్రి, లక్ష్మి, దుర్గ, చంద్రకళ, రమణ, జ్యోతి పాల్గొన్నారు.