Anganwadi Centre | కాంగ్రెస్ సర్కార్ హయాంలో అంగన్వాడీ కేంద్రాలపై సరైన పర్యవేక్షణ లేకుండా పోయింది. దీంతో అంగన్వాడీ చిన్నారులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఓ అంగన్వాడీ టీచర్ నిర్లక్ష్యానికి ముగ్గురు పిల్లలు అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలో వెలుగుచూసింది.
సత్తుపల్లి మండల కిష్టారం గ్రామంలోని అంగన్ వాడీ సెంటర్లో ఆయా గన్నేరు ఆకులు పడిన ఆహారాన్ని పిల్లలకు వడ్డించింది. అంతేకాదు ఈ విషయం బయటికి పొక్కకుండా మూడు రోజులుగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులకు వైద్యం చేయించడం గమనార్హం. ఈ క్రమంలో పిల్లల ఆరోగ్యం విషమించడంతో తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. హార్ట్ బీట్ పెరుగుతుందంటూ పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Rashmika | భర్త విజయ్‌తో మూడు నెలల తర్వాత ఫుల్ క్వాలిటీ టైమ్.. నేచరే ఇలా చేసిందేమో ..
ACB | సూర్యాపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య నివాసంలో ఏసీబీ మెరుపు దాడులు