– పోటు రంగారావుపై దేశద్రోహ కేసు సిగ్గుచేటు
కారేపల్లి, ఏప్రిల్ 09 : పాలకులను ప్రశ్నించే గొంతుకలపై బీజేపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ సింగరేణి మండల కార్యదర్శి గుమ్మడి సందీప్, ఖమ్మం డివిజన్ కార్యవర్గ సభ్యుడు గుగులోతు తేజ నాయక్ విమర్శించారు. గురువారం కారేపల్లిలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుపై ఎన్ఐఏ దేశద్రోహం కేసు పెట్టి ఈ నెల 22న విచారణకు రావాలని నోటీస్ ఇవ్వటం సిగ్గుచేటైన విషయమన్నారు. బీజేపీ తన రహస్య ఎజెండా అయిన కమ్యూనిస్టుల అణచివేత విధానాలను అమలు చేస్తుందన్నారు. రాజ్యాంగ సంస్ధలను బీజేపీ తన జేబుసంస్ధలుగా మార్చుకోని ప్రజల హక్కుల కోసం గొంతెత్తున్న వారిపై దేశద్రోహం కేసులు మోపుతూ నిరంకుశత్వంను ప్రదర్శిస్తుందన్నారు.
కేంద్ర బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన అనేకమంది, మేధావులను ప్రజా నాయకులను విప్లవకారులను జర్నలిస్టులను, హత్యలను చేయించడం జైళ్లల్లో పెట్టడం బిజెపి ప్రభుత్వానికి రివాజుగా మారిందన్నారు. మోదీ ప్రభుత్వం పద్ధతిని మార్చుకోకపోతే దేశ వ్యాప్తంగా ఆందోళనకు చేయటం జరుగుతుందన్నారు. పోటు రంగారావు పై మీద మోపి విచారణకు రమ్మనే, తప్పుడు నోటీసులను ఉప సంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాస్ లైన్ నాయకులు రావుల నాగేశ్వరావు, పుల్లకాని సత్తిరెడ్డి, ధరావత్ సక్రు నాయక్, భూక్య నాగరాజు, గుగులోతు లచ్చు, రాము పాల్గొన్నారు.

‘ప్రశ్నించే గొంతుకలపై ఉక్కుపాదం’