మధిర, డిసెంబర్ 22: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెంటనే రాజీనామా చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మధిర తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నుంచి కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అమిత్‌షా దిష్టిబొమ్మను దహనం చేశారు.
పెనుబల్లి, డిసెంబర్ 22: అంబేద్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పార్లమెంట్లో ప్రస్తావించడం పట్ల సీపీఎం, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో అమిత్‌షా దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ముదిగొండ, డిసెంబర్ 22: మండల కేంద్రంలో ఆదివారం స్థానిక బస్టాండ్ సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆ పార్టీ నాయకుడు బట్టు పురుషోత్తం మాట్లాడుతూ.. కులమతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్న వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఎర్రుపాలెం, డిసెంబర్ 22: కాంగ్రెస్, సీపీఎం ఆధ్వర్యంలో ఎర్రుపాలెంలో అంబేద్కర్సెంటర్నందు అంబేద్కర్ విగ్రహం వద్ద అమిత్‌షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర కేబినెట్ నుంచి అమిత్‌షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
సత్తుపల్లిటౌన్, డిసెంబర్ 22: భారత పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్‌ను అవమానపరిచే విధంగా మాట్లాడిన అమిత్‌షాకు కేంద్రహోంమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని, తక్షణమే అమిత్‌షాను బర్తరఫ్ చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు జాజిరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఎం సత్తుపల్లిరూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో గంగారం ప్రజాసంఘాల కార్యాలయం నుంచి రింగ్‌రోడ్డు సెంటర్ వరకు అమిత్‌షా దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించి అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు.
బోనకల్లు, డిసెంబర్ 22: అంబేద్కర్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను బర్తరఫ్ చేయాలని పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ప్రజాసంఘాలు, సామాజిక సంఘాలు, ప్రజాతంత్రవాదులు మండల కేంద్రంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.
రఘునాథపాలెం, డిసెంబర్ 22 : కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌షా పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని సీపీఐ(ఎం), కాంగ్రేస్, సీపీఐ(ఎంల్) మాస్‌లైన్ నేతలు మండిపడ్డారు. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆదివారం రఘునాథపాలెం సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా ఆయా పార్టీల నేతలు ఎస్.నవీన్‌రెడ్డి, వాంక్డోత్ దీపక్‌నాయక్, ఆవుల మంగతాయి మాట్లాడుతూ అమిత్ షా వ్యాఖ్యలతో దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. కేంద్రమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.