ఖమ్మం రూరల్, ఏప్రిల్ 14 : రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు కరుణగిరిలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలకు మున్సిపల్ వైస్ చైర్మన్ పి.అనిత హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, బిజెపి నాయకులతో పాటు సంఘాల నాయకులు, అంబేద్కర్ యువజన సంఘం బాధ్యులు పాల్గొన్నారు.

‘అంబేద్కర్ జీవితం స్ఫూర్తిదాయకం’