బోనకల్లు ఏప్రిల్ 14 : ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ జడ్పిటిసి బానోతు కొండ, మాజీ ఏఎంసీ చైర్మన్ బంధం శ్రీనివాస్ రావు మాట్లాడుతూ…
అంబేద్కర్ మేధావి.. ఉన్నత విద్యను అభ్యసించి రిజర్వేషన్లు అందించిన ఏకైక వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జున్, కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు పారా ప్రసాద్,0 ఇటికాల శ్రీనివాసరావు, గద్దల వెంకటేశ్వర్లు, కంచర్ల బాబు, బంధం నాగేశ్వరరావు, గుండపనేని సుధాకర్, వెంగళ కనకయ్య, సయ్యద్ మదర్ సాహెబ్ పాల్గొన్నారు.