భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడని, దేశ ప్రజలకు స్వేచ్ఛా, స్వాతంత్య్రం అందించిన మహనీయుడని, ఆయన సేవలు చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు. సోమవారం ఆయన 134వ జయంతి వేడుకలను ఉమ్మడి ఖమ్మంజిల్లా వ్యాప్తంగా వాడవాడలా ఘనంగా నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, పలు సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.
ఎర్రుపాలెం మండలంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, జడ్పీ మాజీ చైర్మన్ కమల్‌రాజు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిం చారు. ఖమ్మం జడ్పీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారని కొనియాడారు.
ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం(తెలంగాణ భవన్)లో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వర రావు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేండ్ల పాలనలో అంబేదర్పై చూపిన గౌరవం ప్రత్యేకమైనదన్నారు.
ఖమ్మం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, కొత్తగూడెంలో కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, అదనపు కలెక్టర్ విద్యాచందన, భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో పీవో రాహుల్, కారేపల్లి, ఇల్లెందులో మాజీ ఎమ్మెల్యేలు బానోత్ మదన్‌లాల్, బానోత్ హరిప్రియానాయక్ తదితరులు అంబేద్కర్‌కు ఘనంగా నివాళి అర్పించారు. -నమస్తే నెట్వర్క్