నవ వసంతం వచ్చేసింది.. వస్తూ వస్తూ సంతోషాలను నింపుకొని వచ్చింది.. ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తించింది.. శనివారం రాత్రి నుంచే సంబురాలు మొదలయ్యాయి. ఆదివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ‘న్యూఇయర్’ వేడుకలు అంబరాన్నంటాయి. యువత కేరింతలు కొడుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. స్నేహితులతో కలిసి కేకులు కోసి శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.ప్రార్థనా మందిరాలు, ఆలయాలు భక్తులు, విశ్వాసులతో కిటకిటలాడాయి.
– నెట్వర్క్
ఉమ్మడి జిల్లాలో ఆదివారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం అర్ధరాత్రి నుంచి సంబురాలు ప్రారంభమయ్యాయి. యువత కేరింతలు కొడుతూ పటాకులు కాలుస్తూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. కేకులు కోస్తూ.. నృత్యం చేస్తూ సందడి చేశారు. మహిళలు ఇళ్ల ముందు ముగ్గులు వేశారు. పార్థన మందిరాలు, ఆలయాల్లో విశ్వాసకులు, భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
– నెట్వర్క్