కారేపల్లి, ఆగస్టు 13 : విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ సమరశీల పోరాటాలు చేస్తుందని ఆ సంఘం ఖమ్మం జిల్లా నాయకులు సాయి, ఆకాశ్ అన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ పతాకాన్ని వారు అవిష్కరించి మాట్లాడారు. విద్యాలయాల్లో మతోన్మాద విధానాలను ఎండగడుతూ శాస్త్రీయ విద్యకు ఏఐఎస్ఎఫ్ పోరాడుతుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విద్య కాషాయాకీరణపై విద్యార్ధులను చైతన్యం చేసి శాస్త్రీయ దృక్పదం వైపు నడిపించటానికి ఉద్యమిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు కిరణ్, మహేశ్, సాత్విక, నరేందర్, ఉమామహేశ్వరి, గోపి, నిహారిక పాల్గొన్నారు.